వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు హాస్పిటల్ల, మందుల షాప్ లు రోగులతో కిత కిత లాడుతువుంటాయి. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువమంది జ్వరం, జలుబు, దగ్గు వంటి జబ్బులతో బాధపడతా ఉంటారు. దీనికి కారణం వాతావరంలో మార్పు రావడమే. ఈ కాలంలో ఎక్కువగా విషజ్వరాలు పీడిస్తా ఉంటాయి. ఇవి చిన్న జబ్బులే అయిన వీటికోసం మనం హాస్పిటల్ల తిరగతావుంటాము. అధిక మొత్తంలో డబ్బుని వృధా చేస్తుంటారు. అతి తక్కువ కర్చుతో వాటిని సులభంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
జ్వరం వచ్చినపుడు ఏం చేయాలి
జ్వరం వచ్చినపుడు హాస్పిటలకి వెళ్ళి అధికంగా ఖర్చు చేయడం కంటే, మన ఇంటి దగ్గరే, మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలలో దొరికే తిప్పతీగతో ఇలచేస్తే ఇలా చేస్తే, ఇట్టే జ్వరం తగ్గిపోతుంది. అది ఎలాగంటే ఒక 4 లేదా 5 తిప్ప తీగ ఆకుల్ని తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తిప్ప తీగ ఆకులు బయట లేదా రోడ్ల పక్కన ఉంటాయి కాబట్టి, వీటి మీద దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుంది. తరువాత ఒక స్టీల్ లేదా మట్టి పాత్రను తీసుకొని స్టౌ మీద పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్ళు (200 ml లేదా 250 ml) పోయాలి. తరువాత అందులో ముందుగా తీసుకున్న తీప్ప తీగ ఆకుల్ని అందులో వేసి 4 లేదా 5 నిమిషాలు మరిగించి కషాయం లా చేసుకొని గోరు వెచ్చగా తాగాలి. వేడి వేడిగా టీ లాగా కూడా త్రాగొచ్చు. ఇది చేదుగా ఉండడం వలన కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి ఇందులో కొద్దిగా తేనె లేదా తాటి బెల్లం కలిపి తియ్య తియ్యగా త్రాగొచ్చు.
ఎప్పుడు ఎలా త్రాగలి
జ్వరం వచ్చినపుడు ఈ తిప్పతీగ కషాయాన్ని ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తరువాత అరగంట వరకు ఏమి తీసుకోకూడదు. ఒక గంట వరకు ఉంటే మరీ మంచిది. దీన్ని మూడు పూటల తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని రెండు లేదా మూడు రోజులు తీసుకున్నట్లయితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. వైరల్ జ్వరాన్ని కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. చిన్న పిల్లలకైతే ఒక సంవత్సరం పిల్లల దగ్గరనుంచి వీటిని ఇవ్వొచ్చు. పిల్లలకి ఒక 100 మి.లీ (అంటే ఒక చిన్న టీ స్టేల్ గ్లాస్ అంతా) ఇస్తే సరిపోతుంది. తిప్పతీగ కషాయం చేదుగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు దీన్ని త్రాగటానికి ఇష్టపడరు. వాళ్ళు త్రాగలంటే తేనె కొద్దిగా ఎక్కువగా కలిపి(అంటే తియ్యగా ఉండే విధంగా), కొద్దిగా నిమ్మ రసం కలిపి ఇవ్వాలి. నిమ్మరసం కలపడం వలన పిలుపు ఉందుండి కాబట్టి చేదు అంతగా అనిపియ్యదు.
కేవలం జ్వరం వచ్చిన వాళ్లు మాత్రమే కాకుండా మిగతా వాళ్లు కూడ దీన్ని అప్పుడప్పుడు ఈ తిప్పతీగ కషాయాన్ని తీసుకోవచ్చు. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటుంది. అందువలన మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది.
తిప్ప తీగని ఎలా గుర్తించాలి
తిప్పతీగ తమలపాకు ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది బయట ఎక్కడపడితే అక్కడ రోడ్ పక్కన ఎక్కువగా కనబడతా ఉంటుంది. ఈ తిప్పతీగ చెట్టు తీగల్లాగా మెలికలు తిరిగి అల్లుకు పోతుంది. ఈ తిప్పతీగల్లాగే ఇంకో చెట్టు కూడా ఉంటుంది. ఈ రెండింటిని చూస్తే తిప్పతీగ ఏదో కంపెట్టడం కొంచెం తికమక అవ్వోచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే తిప్ప తీగ యొక్క ఆకులు కొంచెం పలచగా ఉంటుంది. దీని యొక కాండం తెల్లగా ఉంటుంది. అదే వేరేది అయితే వాటి యొక్క ఆకు కొద్దిగా మందంగా ఉండి, వాటి యొక్క కాండం ఎర్రగా ఉంటుంది. పైన ఉన్న ఫోటోని చూడండి.