top of page

కొత్త సినిమాల అప్డేట్స్: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మంచి శుభవార్త


megastar  viswambhara

ఫిల్మ్ డెస్క్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో అగ్ర కధానాయకుడైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వస్తే చాలు థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో నిండిపోతాయి. ఆయన స్టెప్పులు వేస్తేచాలు థేయటర్లు అన్నీ విజిల్స్ లో మారుమోగిపోతుంది. ఆయన నటన అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. ఫిల్మ్ ఇండస్ట్రీ  లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్, డాన్స్ అన్నింటిలోనూ అదరగొట్టే సత్తా ఆయన సొంతం. ఆయన సినిమాలకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తా ఉంటారు. మరి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విశేషాలేమిటో తెలుసుకుందాం.

 



చాలాకాలం గ్యాప్ తరువాత చిరంజీవికి సినిమా ప్రాజెక్టులు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆయన తదుపరి  రాబోయే చిత్రం విశ్వంభర చాలా  సంచలనం సృస్టించభోతుంది. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10, 2025న విడుదల చేయడానికి చిత్ర బృదం సిద్దంగా ఉంది . ఈ మూవీ యొక్క టీజర్ ని మెగస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22, 2024న విడుదల చేయాలని  భావిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కూడా నటించారు. హార్షవర్ధన్, సురభి, 

 వెన్నెలకిషోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. కీరవాణి గారు చిరు సినిమాకి సంగీతాని అందించడం ఇది నాల్గోవసారి.  దీన్ని UV క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది 2025లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా ఉంటుందని విశ్లేష వర్గాలు చెబుతున్నాయి.

 



విశ్వంభరతో పాటు, చిరంజీవి తన 68వ పుట్టినరోజున 2023లో తాత్కాలికంగా మెగా 157 పేరుతో మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించనున్నారు మరియు చిరంజీవి కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిల్వబోతుంది.

 


మరి అభిమానులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూఉన్నారు. అదేవిధంగా అప్పట్లో సంచలనం సృస్టించి, రికార్డ్ ల మోత మోగించిన ఇంద్ర  మూవిని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22, 2024 న రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  మరి రీ రిలీజ్ కలెక్షన్ ల వర్షం ఎలా ఉంటుందో చూద్దాం.                     

bottom of page