top of page

గ్యాస్ట్రిక్ సమస్య లేదా గుండె నొప్పి అని తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా ?


gastric trouble

గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఈ రోజుల్లో ప్రతిఒక్కరికి మామూలు అయిపోయిది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ సమస్యలు  ఎదురవుతున్నాయి. కొంత మందిలో అయితే ఏది గ గ్యాస్ట్రిక్ సమస్య నో  లేదా గుండె జబ్బో తెలుసుకోలేక ప్రాణాలు పోవటం వంటివి జరుగుతున్నాయి.

 


గ్యాస్ట్రిక్ సమస్య ఏందుకు వస్తుంది

గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుందంటే రకరకాల కారణాలు చెబుతుంటారు. మన జీవన విధానంలో ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందని చెబుతుంటారు. మనం ఆహారాన్ని సరైన సమయానికి తినకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశము ఉంటుంది. కొంతమంది లో తిన్న ఆహారం సరిగా అరగక అవి పొట్టలో నిల్వ ఉండిపోయి ఆసిడ్ రూపంలో గ్యాస్ ని విడుదలచేస్తుంది. దీన్నే గ్యాస్ట్రిక్ సమస్య అంటారు. ఉదయం పూట మోసన్స్ సరిగా అవక పోవటం, మలబద్దకం వలన కూడా ఈ సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది అయితే స్పైసీ ఫుడ్స్ అంటే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం  వలన కూడా వస్తుందని చెబుతుంటారు.


 


గ్యాస్ట్రిక్ సమస్య లేదా గుండె నొప్పి అని ఎలా గుర్తించాలి 

గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినపుడు ఛాతీలో లేదా పొట్ట బాగంలో మంట లేదా నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకొక్కసారి గుండె మండుతున్నట్లు అని కూడా అనిపిస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరంగా ఉండటం, తేన్పులు రావటం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ సమస్య వచ్చినపుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఆకలి సరిగా వెయ్యదు. కింద బాంబులు ఎక్కువగా వస్తుంటాయి.



గుండె నొప్పి అయితే ముఖ్యంగా మనం నడిచినపుడు నొప్పి వస్తే దాన్ని మనం గుండె నొప్పిగానే భావించాలి. ఆ నొప్పి మనకు ఛాతి భాగంలోనైనా  లేదా ఉదర భాగంలోనైనా, నడిస్తే నొప్పి రావడం, నడవడం ఆపేస్తే నొప్పి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనబడితే అది ఖచ్చితంగా గుండె నొప్పి అని గుర్తించాలి.


 

ఛాతి భాగంలో నొప్పి వచ్చి ఎడమ చెయ్యి లాగుతున్నట్లు అనిపించిన (కొన్ని సందర్భాల్లో రెండు చేతులు లాగుతున్నట్లు అనిపిస్తుంది), దవడల దగ్గర లాగుతున్నట్లు అనిపించిన, విపరీతంగా చెమటలు పడుతున్నట్లు అనిపించిన గుండె నొప్పి అని గుర్తించాలి. ఆయాసం ఎక్కువగా ఉన్నపుడు కూడా గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. గుండె నొప్పి వచ్చినపుడు గుండె మీద ఎవరో కూర్చున్నట్టు భారంగా ఉంటుందని కూడా కొంతమంది చెబుతుంటారు. వత్తిడి వల్ల కూడా గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండె నొప్పి వచ్చినపుడు హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది.   


 

అలాగే బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, ప్రోగత్రాగే వాళ్లు, డయాబెటిస్ అంటే బి.పి, సుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు వీళ్లు మాత్రం మొదటి సారి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది అని అనుకున్నపుడు తప్పనిసరిగా గుండెకు సబందించిన పరీక్షలు చేయించుకోవాలి.    



             

గ్యాస్ట్రిక్ సమస్య నివారణ మార్గాలు

మొదటిది టాబ్లెట్లు వాడకుండా గ్యాస్ట్రిక్ సమస్య తగ్గించు కోవాలంటే ముందుగా మనం చేయాల్సింది ఉదయం లేవగానే 1 నుంచు 11/2 లీటర్ల నీటిని త్రాగాలి. ఒక్కసారి త్రాగలేకపోయిన కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అయిన త్రాగోచ్చు. ఇలా చేయడం వలన మనకు మోసన్స్ ఫ్రీ గా అవుంతుంది. ఇలా ఉదయం గనుక రెండుసార్లు ఫ్రీ మోసన్స్ అయిందంటే మన పొట్ట లోపల వున్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. తద్వారా కడుపుబ్బరం తగ్గి ఫ్రీ గా ఉంటుంది. అంతేకదా మరి మనం తిన్న ఆహారం కడుపులో నిల్వ వుండకుండా బయటకు పోతే కదా గ్యాస్ ఫామ్ అవకుండా ఉండేది. అంతే కానీ ఫ్రీ మోసన్ అవకుండా తిన్న ఆహారాన్ని కడుపులోనే నిల్వ వుంచి బయటకి పోనికుండా చేస్తే గ్యాస్ రూపంలో కొందరు బాంబుల ద్వారా బయటకు వదలతా ఉంటారు. కాబట్టి పైన చెప్పిన విధంగా పాటిస్తే  గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా అదుపులో చూసుకోవచ్చు. ఈ విషయాన్ని డా. మంతెన సత్యనారాయణ గారు చెప్పారు.   

 


రెండవది ఈ సమస్య ఉన్నవారు డా. ఖాధర్ వలి చెప్పిన విధంగా అంబలి త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్య ను తగ్గించుకోవచ్చు. అది మిల్లెట్ అంబలి అయిన లేదా రాగులతో చేసిన అంబలి అయిన తీసుకోవచ్చు. ఇందులో ప్రోబయాటిక్స్ వుండడం వలన అవి పొట్టలోని గ్యాస్ ను బయటకు పంపించేస్తుంది. తద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  

 


అలాగే ఉదయాన్నే కాళి కడుపులో అలువెరా జూస్ తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇది కడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది.

 


ముఖ్యంగా మానసిక ఆరోగ్యం బాగా వుండేలా చూసుకోవాలి. అంటే పనికి సంబంధించిన వత్తిడి, ఆర్దిక పరంగా కలిగే వత్తిడి ఇలా రకరకాల వత్తిళ్లకు గురి కాకుండా చూసుకోవాలి.  ఇది కూడా గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీస్తుంది.    

 

 

ఒకవేళ గ్యాస్ట్రిక్ సమస్య లేదా గుండె నొప్పి అని తెలియని పక్షంలో డాక్టర్ ని సంప్రదించడం మంచిది.  

                      

bottom of page